Skincare | జిడ్డు చర్మం త్వరగా ముడతలు పడదా.. ఇది నిజమేనా !!
Skincare |చర్మ సంరక్షణకు సంబంధించి అర్థంలేని ప్రచారాలు అనేకం. వాటిలో నిజమెంత, అసత్యాలెన్ని అన్నది తెలుసుకోవాల్సిందే.
అపోహ: చర్మానికి రసాయనాలు మంచివి కావు.
వాస్తవం: ఈ మధ్యకాలంలో ఆర్గానిక్, కెమికల్ ఫ్రీ అనే పదాలు సౌందర్య ఉత్పత్తుల విషయంలో బాగా వినిపిస్తున్నాయి. నిజానికి రసాయనాలు లేకుండా ఏ సౌందర్య సాధనాన్నీ తయారు చేయలేరు. కానీ, ఆయా ఉత్పత్తుల మీద ఉన్న పేర్లను బట్టి ఏదేదో ఊహించుకుంటాం. ఉదాహరణకు పాలీహైడ్రాక్సీ స్టీరిక్ ఆసిడ్ అనేది కెమికల్ కాదు. ఆముదం రసాయనిక నామం. విటమిన్-సిని కూడా అస్కార్బిక్ ఆసిడ్ అని రాస్తారు. అలాగే, ‘ఆర్గానిక్’గా ప్రచారం అవుతున్నవన్నీ సేంద్రియ ఉత్పత్తులు కాకపోవచ్చు. అయినా, తగిన మోతాదులో వినియోగిస్తే రసాయనాలు కూడా చర్మానికి మేలు చేస్తాయి.
అపోహ: ఏదైనా క్రీమ్ ఒంటికి రాసుకున్నప్పుడు మంటగా అనిపిస్తే బాగా పనిచేస్తుందని అర్థం.
వాస్తవం: చర్మానికి కొన్ని ఉత్పత్తులు రాసినప్పుడు కొంత మంట కలుగుతుంది. అందులోని ఆల్కహాల్ లేదా మెంథాల్ దీనికి కారణం. విపరీతమైన మంట కలిగినా లేదా ఎర్రగా కందినా ఉత్పత్తి బాగా పనిచేస్తున్నట్టు అర్థం కాదు. మరీ మంటగా అనిపిస్తే కడిగేసుకోవడం మేలు.
అపోహ: జిడ్డు చర్మం త్వరగా ముడతలు పడదు.
వాస్తవం: జిడ్డు చర్మ తత్వం ఉన్నవాళ్లలో సహజంగా సీబం అనే నూనె పదార్థం విడుదల అవుతుంది. ఆ కారణంగా ముడతలు లేదా గీతలు తక్కువగా కని
పిస్తాయి. అంతేకానీ జిడ్డు చర్మం ఉన్న వాళ్లకు చర్మం ముడతలే పడదని అర్థం కాదు. జిడ్డు చర్మమైనా, పొడి చర్మమైనా యవ్వనంగా కనిపించడం అన్నది ఆయా వ్యక్తుల చర్మ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది.
అపోహ: చర్మ సంరక్షణకు వాడే ఉత్పత్తుల్లో దీని తర్వాత ఇది అని వరుస క్రమంలో వాడాలన్న నియమమేం లేదు.
వాస్తవం: చర్మ సంరక్షణ కోసం క్రీములూ, ప్యాక్లూ, క్లెన్సర్లలాంటివి వాడేప్పుడు ముందుగా మృతకణాలను తొలగించేవి వినియోగించాలి. తర్వాతే మిగతావి. అంటే తక్కువ గాఢత ఉన్న ఉత్పత్తుల నుంచి మొదలుపెట్టి ఎక్కువ గాఢత ఉన్న వాటిని చివర్లో వాడాలి. మృతకణాలను తొలగించాక ఏం రాసినా అవి చర్మంలోకి చక్కగా ఇంకుతాయి.
అపోహ: నిత్యం చర్మాన్ని శుభ్రం చేసుకుంటేనే, మృతకణాలను వేగంగా తొలగించుకోవచ్చు.
వాస్తవం: మృతకణాలను తొలగించేందుకు క్లెన్సర్ల తరహా ఉత్పత్తులను అతిగా వాడటం వల్ల బయటి కాలుష్యం, విషపూరిత పదార్థాల నుంచి చర్మాన్ని కాపాడే స్కిన్ బ్యారియర్ దెబ్బతింటుంది. అందుకే మితంగానే చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
Read More :
“Naya Mall | దీంతో మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయంట.. ధర ఎంతో తెలుసా!!”
“చర్మం మెరవాలా? అయితే ఈ ఆయిల్‌ను వాడి చూడండి”
“ఈ టిప్స్ పాటిస్తే ఏజ్ పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తారు..!!”
“ముఖంపై మడతలు వస్తున్నాయా? అయితే ఈ పండు తినండి”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

