ముఖం సన్నగా అందంగా కనిపించాలా? అయితే ఇలా చేసి చూడండి
Beauty Tips | ముఖం ఆకృతి మారినట్లు అనిపిస్తున్నదా? బొద్దుగా, మెత్తగా ఉన్న బుగ్గల్లో కొవ్వు పేరుకుపోయినట్లు అనిపిస్తున్నదా? చికిత్స అనీ, క్రీములనీ ఏవేవో ప్రయోగాలు చేసి విసిగిపోయారా? సహజ పద్ధతుల ద్వారా 100 శాతం సురక్షితంగా కొవ్వును తొలగించే ఉపాయాలను సూచిస్తున్నారు బ్యుటీషియన్లు.
ముఖ వ్యాయామం: ఇది ముఖ కండరాలను సమర్థంగా దృఢపరుస్తుంది. బొద్దు బుగ్గల్లో కొవ్వును తగ్గించి సన్నబడేట్లు చేస్తుంది. ముఖ కండరాల్లో కొవ్వు శాతాన్ని తగ్గించడానికి ముఖ వ్యాయామాన్ని (ఫేషియల్ ఎక్సర్సైజ్) ప్రభావవంతమైనదిగా పేర్కొంటున్నారు నిపుణులు.
ఫేస్ మసాజ్: ఇది ప్రాచీనమైన టెక్నిక్. ముఖానికి మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ముఖంలో కొవ్వు కరిగిపోతుంది. ఇలా రోజూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాకపోతే, ప్రత్యేకమైన నూనెలనే ఉపయోగించి మసాజ్ చేయాలి.

వేడి టవల్ ట్రీట్మెంట్: ముఖంలో కొవ్వును తగ్గించుకోవడానికి వేడి టవల్ చికిత్స బాగా పనిచేస్తుంది. వేడినీటిలో టవల్‌ను ముంచి, నీరు మొత్తం పొయ్యేలా పిండి ముఖంపై పెట్టుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.
చూయింగ్ గమ్: ఇది వింతగా అనిపించవచ్చు. కానీ ముఖంలో కొవ్వును నియంత్రించడంలో శక్తిమంతంగా పనిచేస్తుంది. రోజుకు 2-3 సార్లు చూయింగ్ గమ్ నమలడం వల్ల ముఖ కండరాలు కదిలి కొవ్వు తగ్గిపోతుంది. ముఖానికి మంచి ఆకారం తీసుకురావడంలో ఇది సులువైన ట్రిక్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
గ్లిజరిన్ మాస్క్: గ్లిజరిన్, ఎప్సమ్, ఉప్పు, నూనె మిశ్రమాన్ని ముఖంపై మాస్క్ వేసుకోవాలి. 10 నిమిషాల పాటు దానిని ఆరనివ్వాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా
రెగ్యులర్‌గా చేయడం వల్ల ముఖంలో కొవ్వు సులభంగా తొలగిపోతుంది.
బెలూన్లలో గాలి: బెలూన్లను చూస్తే ఎవరికైనా బాల్యం గుర్తుకొస్తుంది. వాటినిండా గాలి ఊదాలనేంత ఉత్సాహం వచ్చేస్తుంది. అంతలోనే, ఎవరైనా చూస్తారేమో అని ఆగిపోతాం. కానీ ఆగిపోవద్దని అంటున్నారు నిపుణులు. తరచూ బెలూన్స్లో గాలి ఊదితే.. ముఖం లోని కొవ్వు క్రమంగా కరిగిపోతుందని చెబుతున్నారు.
విటమిన్-ఇ: ముఖంలో కొవ్వు శాతాన్ని తగ్గించుకోవడానికి విటమిన్-ఇ బాగా పనిచేస్తుంది. దీనికి సంబంధించిన క్యాప్సూల్ నుంచి నూనెను తీసి ముఖానికి మసాజ్ చేయాలి. బొద్దుగా ఉన్న ప్రదేశంలో రుద్దుతూ ఉండాలి. ఇలా రోజూ చేస్తే ముఖంలో కొవ్వు తగ్గడంతోపాటు చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.
Read More :
“Shocking | ఎండలో పడుకుంటే.. ఆ అమ్మాయి నుదుటి చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయింది!”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- Face
- skin care
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

