Shocking | ఎండలో పడుకుంటే.. ఆ అమ్మాయి నుదుటి చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయింది!
సముద్రంలో ఆటలాడుకుంటూ.. సరదాగా గడపడం కోసం బీచ్‌లకు వెళ్తారు. అలా వెళ్లినప్పుడు ఎండలో పడుకోవడం చాలా మందికి అలవాటు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఎండలో కాసేపు పడుకొని ట్యాన్ పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే తను కూడా బీచ్‌కు వెళ్లింది సిరిన్ మురాద్ అనే యువతి. పాతికేళ్ల ఈ అమ్మాయి బల్గేరియాలో ఒక బీచ్‌కు వెళ్లి ఎండలో పడుకుంది. ఎండ నేరుగా మీద పడకుండా రాసుకునే సన్‌స్క్రీన్ లోషన్లు ఏమీ రాసుకోలేదు.
అలాగని గొడుగుల కింద కూడా పడుకోలేదు. నేరుగా తనపై ఎండ పడేలా పడుకొని నిద్రలోకి జారుకుంది. ఒక అరగంట తర్వాత కళ్లు తెరిచేసరికి మొఖమంతా మంటగా, నొప్పిగా అనిపించింది. మంచి ఎండలో అలా పడుకునే సరికి మొఖమంతా కందిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయింది. మరుసటి రోజు తన నుదురు చాలా నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. అప్పుడు ఆమె మొఖం చూసిన ఫ్యామిలీ అంతా షాకైపోయింది.

ఎందుకంటే సిరిన్ నుదుటిపై చర్మం ప్లాస్టిక్‌లా మారిపోయి, ముడుతలు పడిపోయి ఉంది. ‘‘ఆ రోజంతా అలాగే గడిచిన తర్వాత మరుసటి రోజు ఆ చర్మం ఊడిపోవడం మొదలైంది. చేత్తో నెమ్మదిగా లాగేస్తూ ఉంటే.. వారం రోజులకు కొంత నొప్పి పుట్టినా ఆ చర్మం మొత్తం ఊడిపోయింది. కానీ ఆ తర్వాత చాలా ఫ్రెష్‌గా అనిపించింది. నుదుటిపై చర్మం కూడా చాలా సున్నితంగా మారింది’’ అని ఆమె చెప్పింది. అయితే ఇలాంటి రిస్కులు తీసుకోవద్దని, ఎండలో పడుకునేటప్పుడు కచ్చితంగా సన్‌స్క్రీన్ లోషన్స్ వాడాలని నిపుణులు చెప్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

