మొటిమలు తగ్గి చర్మం మెరవాలా? అయితే వీటి గురించి తెలుసుకోండి
Skin care – Beauty Tips | మార్కెట్లో దొరికే ప్రతి సౌందర్య సాధనమూ సురక్షితమే అని నమ్మడానికి వీల్లేదు. చర్మం తీరు, ఆరోగ్య సమస్యను బట్టి వాటిని ఎంచుకోవడం ఉత్తమం. తయారీలో ఎలాంటి రసాయనాలు వాడారన్నదీ తెలుసుకోవాలి. ఆ ప్రయత్నంలో ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.
హయలురానిక్ యాసిడ్
కంటిలోని తడిలో, ఎముకల గుజ్జులో కనిపించే ఈ యాసిడ్‌ను ల్యాబ్‌లో తయారు చేసి, రకరకాల సౌందర్యోత్పత్తులలో వినియోగిస్తారు. పొడి చర్మంలో తేమను నింపి, ముడతలు పడనీయకుండా కాపాడుతుంది. ఈ ఆమ్లం ఉన్నఉత్పత్తులను వాడితే వెంటనే ఫలితం కనిపిస్తుంది.
సాలిసిలిక్ యాసిడ్
రకరకాల కూరగాయలు, పండ్లలో దొరికే సాలిసిలిక్ ఆమ్లం జిడ్డు చర్మం వారికి బాగా పనిచేస్తుంది. మొటిమలను నివారిస్తుంది. చర్మం ఎర్రబారకుండా కాపాడుతుంది. బ్లాక్‌హెడ్స్, వైట్హెడ్స్లాంటి వాటిని నివారిస్తుంది.
విటమిన్- సి
నిమ్మజాతి పండ్లలో దొరికే విటమిన్-సి మనకు సుపరిచితమే. పిగ్మెంటేషన్‌ను తగ్గించి చర్మ నిర్మాణంలో తోడ్పడుతుంది. ఇది వాడటం ప్రారంభించాక నాలుగు నుంచి ఆరువారాల్లో చర్మం కాంతిమంతంగా కనిపించడం మొదలవుతుంది. కానీ నల్లమచ్చల్లాంటివి తగ్గాలంటే మూడు నాలుగు నెలలు వేచి చూడాల్సిందే!
రెటినాల్
విటమిన్-ఎ రూపమైన రెటినాల్‌ను నిగారింపు కోసం వాడతారు. ఎనిమిది నుంచి పది వారాల్లో మొటిమలు మాయం అవుతాయి. చర్మం మీది ముడతల్లాంటివి తగ్గడానికి మాత్రం ఇంకాస్త సమయం పడుతుంది.
గ్లైకాలిక్ యాసిడ్
యాపిల్, చెరకులాంటి వాటిలో దొరికే గ్లైకాలిక్ యాసిడ్ చర్మం మీది మృతకణాలను తొలగించి మృదువుగా కనిపించేలా చేస్తుంది. పిగ్మెంటేషన్‌ను అరికట్టి ఆరోగ్యమంతమైన చర్మ నిర్మాణానికి తోడ్పడుతుంది.
Read More :
“మిలమిల మెరిసే చర్మం కోసం ఈ ఆయుర్వేద ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేయండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty
- beauty tips
- skin
- skin care
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

