Wrinkles | చర్మంపై ముడతలు తగ్గాలా? నిమ్మకాయతో ఇలా చేస్తే సరి!!
Beauty Tips for Wrinkles | చర్మంపై ముడతల వల్ల వయసు ముదిరినట్టు కనిపిస్తుంది. నిగారింపు పోతుంది. ఒత్తిడి, కాలుష్యం వంటివి కూడా ముడతలకు ఓ కారణమే. అర్థంలేని ప్రయోగాలతో ఉన్న అందాన్ని పాడుచేసుకోకుండా సురక్షితమైన నిమ్మ చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోవచ్చు.
Beauty Tips for Wrinkles | చర్మంపై ముడతల వల్ల వయసు ముదిరినట్టు కనిపిస్తుంది. నిగారింపు పోతుంది. ఒత్తిడి, కాలుష్యం వంటివి కూడా ముడతలకు ఓ కారణమే. అర్థంలేని ప్రయోగాలతో ఉన్న అందాన్ని పాడుచేసుకోకుండా సురక్షితమైన నిమ్మ చిట్కాలతో సమస్యను పరిష్కరించుకోవచ్చు.
నిమ్మ-ఆలివ్ నూనె: ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. బాగా కలిపిన తర్వాత దాన్ని నుదుటిపై, కళ్ల కింద రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో నిగనిగలాడే చర్మం మీ సొంతం. ఆలివ్ ఆయిల్‌కు బదులుగా ఆల్మండ్ ఆయిల్ చేర్చుకోవచ్చు.

నిమ్మ-తేనె: ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

నిమ్మ- చక్కెర: రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ చక్కెర తీసుకోవాలి. ఒక గిన్నెలో ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. రెండు మూడు నిమిషాల పాటు ముఖంపై సున్నితంగా రుద్దాలి. పదిహేను నిమిషాల పాటు అలానే ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే సరిపోతుంది.

నిమ్మ-పెరుగు: ఒక టీస్పూన్ నిమ్మరసం, ఒక టీస్పూన్ పెరుగు తీసుకుని.. ఒక గిన్నెలో బాగా కలపాలి. ముఖంపై కొద్ది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దాదాపు 30 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత కాచి చల్లార్చిన నీటితో కడుక్కోవాలి. రోజుకు మూడుసార్లు ఇలా చేస్తే ముడతలు మటుమాయం.
Read More :
“Health tips | నారింజ పండు తొక్కతో ఇన్ని లాభాలున్నాయా..? ఈ విషయాలు తెలిస్తే అస్సలు పడేయరు!”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

