భద్రాద్రిలో 53 ధరణి రిజిస్ట్రేషన్లు..

కొత్తగూడెం : ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటి వరకు 53 రిజిస్ట్రేషన్లు జరిగాయని కలెక్టర్ ఎంవీ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ధరణిని అందుబాటులోకి తీసుకువచ్చాక రైతులకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా సులువు అయిందని పేర్కొన్నారు. కేవలం మైదాన ప్రాంతంలోనే కాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 28 క్రయ విక్రయాలు, 13 గిప్టు రిజిస్ట్రేషన్లు 10 సక్షేషన్లు, 2 పార్టీషన్లు మొత్తం 53 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఎల్టీఆర్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభం కావడంతో గిరిజన ప్రాంతంలో కూడా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. మండలాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు రెండు రోజుల్లో సిఫారసు చేయాలన్నారు. తహసీల్దార్ సిఫారసు చేసిన ఎల్ ఫారం అధారంగా కే ఫారం జారీచేయబడుతుందనిన్నారు. ధరణిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తాజావార్తలు
- 2021లో బైజూస్ కు మార్కెట్ ఎలా ఉందంటే..?
- ఫిలిప్పీన్స్‌లో భూకంపం:రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు
- హీరో@10 కోట్ల క్లబ్
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు