బుధవారం 08 జూలై 2020
Badradri-kothagudem - Jun 27, 2020 , 02:28:25

వైభవంగా రామయ్య నిత్య కల్యాణం

వైభవంగా రామయ్య నిత్య కల్యాణం

  • భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న బాలసాని 

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలోని రామాలయం ముఖద్వారం వద్ద రాములోరి నిత్యకల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకస్వాములు విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, ఆరాధన, జీలకర్ర బెల్లం, మాంగల్యాదారణ జరిపారు. అనంతరం స్వామి వారికి వివిధ ఆభరణాలు ధరింపజేసి కల్యాణాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు.

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆయన అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకొని అనంతరం లక్ష్మీతాయారు ఆలయం, ఆంజనేయస్వామి వారి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ సూపరింటెండెంట్‌ సాయిబాబా, టీఆర్‌ఎస్‌ నాయకులు యశోద నగేశ్‌, అరికెల తిరుపతిరావు, నవీన్‌కుమార్‌, మామిడి పుల్లారావు పాల్గొన్నారు.  logo