హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka ) హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు (CBI Court) ఈనెల 22కు వాయిదా వేసింది. హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణలో 8 మంది నిందితుల తరుఫున వాదిస్తున్న న్యాయవాదులు తమకు సీబీఐ వేసిన అనుబంధ అభియోగ పత్రాలు (Charge sheets) ఇవ్వాలని కోర్టును కోరారు.
అయితే 20వేల పేజీల హార్డ్ కాపీలు ఇవ్వడం కష్టమవుతుందని డిజిటల్ కాపీలు(Digital Copies) ఇస్తామని సీబీఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. తమకు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని నిందితుల తరుఫు నాయ్యవాదులు విజ్ఞప్తి చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాఫ్ట్‌కాపీ రూపంలో ఇస్తామన్న సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.