Swarnandhra 2047 | పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన పాఠశాలలో కలుషిత నీటిని తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర 2047 కాదు.. ఇప్పుడు గిరిజన బిడ్డలు పడుతున్న బాధల గురించి పట్టించుకోవాలని సూచించారు. విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను చూస్తుంటే సోమాలియా దేశ స్థితిగతులు గుర్తుకొస్తున్నాయని అన్నారు. కురుపాం లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. హైలెవల్ కమిటీ వేసి హాస్టళ్లపై, విద్యార్థుల చదువులపై నిరంతరం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
విశాఖ KGHలో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను పరామర్శించడం జరిగింది. కలుషిత నీరు తాగి దళిత బిడ్డలకు జాండిస్ రావడం దారుణం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో ఇద్దరు బిడ్డలు చనిపోవడం చాలా బాధాకరం. కొంతమంది ICUలో చావు బ్రతుకులతో పోరాటం చేస్తున్నారు. మరొక… pic.twitter.com/KLeqpM2aVD
— YS Sharmila (@realyssharmila) October 7, 2025
వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకొనే 228 ఆడబిడ్డలకు ఒకటే బాత్ రూమ్ ఉందట.. దీనిపై స్వయంగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని వైఎస్ షర్మిల తెలిపారు. హాస్టళ్లలో ఒకే రూంలో 17 మంది నేలమీదే నిద్రిస్తున్నారట. ఇది కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించిన అంశమే అని అన్నారు.. దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇదే విషయంపై కూటమి ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నించానని అన్నారు. గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని అడిగా.. ఇందులో తప్పు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఇవ్వాళ కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత త్రాగునీటితో ఇద్దరు బిడ్డలు చనిపోయి, 128 మంది ఆసుపత్రుల పాలైన ఘటన ఇందుకు నిదర్శనం కాదా? బడి బాగుంటే ఈ దారుణం జరిగేదా? గుడితో పాటు బడి బాగుపడాలని అడగడం నేరమా ? నేను అడిగిన ప్రశ్నకు మతం రంగు ఎందుకు పులిమారు అని నిలదీశారు.
వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకొనే 228 ఆడబిడ్డలకు ఒకటే బాత్ రూమ్ ఉందట. స్వయంగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. హాస్టళ్లలో ఒకే రూంలో 17 మంది నేలమీదే నిద్రిస్తున్నారట. ఇది కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించిన అంశమే. దీనికి సీఎం చంద్రబాబు @ncbn గారు ఏం సమాధానం… pic.twitter.com/tEMXqgeY3g
— YS Sharmila (@realyssharmila) October 7, 2025
వ్యక్తిగతంగా తనకు అన్ని మతాలు సమానమే అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఒక మతానికి పెద్దపీట వేస్తున్నారని.. మిగతా మతాల వారికి అభద్రతా భావం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఒక మతాన్ని అజెండాగా ఎత్తుకున్నారని అన్నారు. గుడులు కడతాం అంటే మజీదులు, చర్చ్ లు కూడా కడతాం అని చెప్పాలి కదా? పురోహితులతో పాటు ఇమాంలు, ఫాస్టర్లకు ప్రభుత్వ సహాయం ఉండాలి కదా ? ముఖ్యమంత్రిగా ఉండి అన్ని మతాలను సమానంగా చూడాలి కదా అని ప్రశ్నించారు. దళితవాడల్లో, హాస్టల్లో బాత్ రూమ్ లు లేవని, వాటిని కల్పించాలని మాత్రమే తాను డిమాండ్ చేశానని అన్నారు. హాస్టళ్లలో కనీస వసతులు లేవని.. నేను మాట్లాడింది నేరంగా చూశారని అన్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం చేశారని మండిపడ్డారు. మా అమ్మ, నాన్న, నా భర్త,బిడ్డలను దూషించారని ఆవేదన చెందారు. నా సంస్కారం మీద మాట్లాడే మీకు ఎక్కడ ఉంది సంస్కారమని ప్రశ్నించారు. ముగ్గురు బిడ్డల ప్రాణాలు తీయడం మీ సంస్కారమా అని నిలదీశారు. కురుపాం బిడ్డల చావులకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హాస్టళ్ల గురించి నేను మాట్లాడితే.. గుడికి టాయిలెట్ కి లింక్ పెట్టారు? అంత భయం ఎందుకు ? అని నిలదీశారు. లోపాలను ఎత్తి చూపిస్తే మతాల గురించి మాట్లాడటం మాని.. హాస్టళ్లలో ముందు వసతులు కలిపించాలని డిమాండ్ చేశారు.
సీఎం చంద్రబాబు @ncbn గారు స్వర్ణాంధ్ర 2047 కాదు… స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలి. ఎప్పుడో 22 ఏళ్ల తర్వాత పరిస్థితి గురించి కాదు …ఇప్పుడు గిరిజన బిడ్డలు పడుతున్న బాధలు గురించి పట్టించుకోవాలి. 2047 వరకు ఎదురు చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు చదువుతున్న బిడ్డలకు 2047 విజన్ ఏం… pic.twitter.com/4trckLVM6r
— YS Sharmila (@realyssharmila) October 7, 2025
సీఎం చంద్రబాబు గారు స్వర్ణాంధ్ర 2047 కాదు… స్వర్ణాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 కావాలని షర్మిల సూచించారు. ఎప్పుడో 22 ఏళ్ల తర్వాత పరిస్థితి గురించి కాదు.. ఇప్పుడు గిరిజన బిడ్డలు పడుతున్న బాధలు గురించి పట్టించుకోవాలని సూచించారు. 2047 వరకు ఎదురుచూసే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు చదువుతున్న బిడ్డలకు 2047 విజన్ ఏం ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. అందుకే స్వరాంధ్ర హాస్టల్స్ విజన్ 2027 ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లను బాగుచేయాలని హితవు పలికారు. హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచాలన్నారు. మీరు మౌలిక సదుపాయాలు కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అన్ని సంక్షేమ హాస్టళ్లను సందర్శిస్తామని.. హాస్టళ్లలో బిడ్డలతో సంతకాల సేకరణ చేపడతామన్నారు. కురుపాం లాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఒక హైలెవల్ కమిటీని వేయాలని, నిరంతర పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేశారు.