అమరావతి : ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) కు గత ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ సీట్లు రావడంతో మతి చలించి కూటమి ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రులు(AP Ministers) అనిత(Anitha) , నారాయణ, అనగాని సత్యప్రసాద్ (Satya prasad) ఆరోపించారు. బుధవారం విజయవాడలో వారు మీడియాతో మాట్లాడారు.
ఏపీలో వరదలు(Floods) , వర్షాలతో తీవ్రంగానష్టపోతే ఆదుకోవాల్సింది పోయి వైసీపీ నాయకులు మందగా విమర్షలు చేస్తున్నారని విమర్శించారు. నాలుగురోజులు విజయవాడ ప్రజలు నీళ్లలోనే ఉండిపోయారని వారికి ప్రభుత్వం సకాలంలో ఆదుకుందని వెల్లడించారు. ప్రజలు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే చంద్రబాబు ఎప్పటికప్పుడు మంత్రులకు ఆదేశాలిచ్చి అప్రమత్తం చేయడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు చేశామన్నారు .
వరదల సమయంలో మొత్తం 10 వేల మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిద్రాహారాలు మానుకొని రాత్రింబవళ్లు కష్టపడ్డారని అన్నారు. ఇప్పటి వరకు వరద సాయం కింద బాధితులకు పెట్టిన మొత్తం ఖర్చు రూ. 602 కోట్లు అయ్యిందని పేర్కొన్నారు. ఆహారానికి రూ. 92.5 కోట్లు, తాగునీటికి రూ. 11.2 కోట్లు, మెడికల్ కేర్‌కు రూ. 4.55 కోట్లు, పారిశుద్ధ్యానికి రూ. 22.56 కోట్లు. ఖర్చు చేశామన్నారు.
కొవ్వొత్తులకు, వీధి దీపాలకు రూ. 23 లక్షలు ఖర్చు చేస్తే, రూ. 23 కోట్లు అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎగ్పఫ్లకు, విలాసవంతాలకు ఖర్చు పెట్టిన జగన్‌లా తాము అవినీతికి పాల్పడ లేదని విమర్శించారు. ఇప్పటికైనా వైసీపీ ఆరోపణలు మానుకోవాలసి సూచించారు.