అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం(Alliance Government) పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీలతో నిర్వహించిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రసుత్తం టీడీపీ, జనసేన హానీమూన్(Honeymoon) నడుస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చిన తరువాత శిశుపాలుడు మాదిరిగా చంద్రబాబు (Chandra Babu) తప్పులను లెక్కించి గట్టిగా పోరాటం చేద్దామని సూచించారు. ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వైసీపీ వైపే ఉన్నారని, ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు మరిచిపోవద్దని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, మనపై కేసులు పెట్టినా భయపడొద్దని కోరారు.
ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీలో నోరు మెదపకుండా కట్టడి చేసే అవకాశముందని జగన్ అన్నారు. ప్రభుత్వ తీరు, ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకున్న తరువాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పేర్కొన్నారు.