అమరావతి : ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే సిండికేట్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారని విమర్శించారు. భీమవరంలో ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆక్వా రైతులకు సరైన ప్రోత్సాహం లేక అనేక అవస్థలు పడుతున్నారు.
ఆక్వా రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిండికేట్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్గా ఏర్పడ్డారు. ఫీడ్, సీడ్ రేట్లను చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తున్నారని ఆరోపించారు. సిండికేట్స్ చేతుల్లో ఆక్వా రైతులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.