YS Jagan | ఏపీలో కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే.. సంచలనంగా వైఎస్ జగన్ ట్వీట్
YS Jagan | ఏపీలో అరటి రైతుల కష్టాల గురించి చెబుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. 'హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి.' అంటూ జగన్ తెలిపారు.
YS Jagan | ఏపీలో అరటి రైతుల కష్టాల గురించి చెబుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘హలో ఇండియా, ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి! ఒక కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే! అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులు పడుతున్న కష్టాలు ఇవి.’ అంటూ జగన్ తెలిపారు.
ఒక అగ్గిపెట్టెకన్నా, ఒక్క బిస్కెట్ కన్నా అరటి పండ్లు చవకగా వస్తున్నాయని వైఎస్ జగన్ తెలిపారు. లక్షల రూపాయలు పెట్టి, నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకు ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమని అన్నారు. అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకూ.. ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని పేర్కొన్నారు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలో ఉచిత పంట బీమా లేదని, ఇన్పుట్ సబ్సిడీలు లేవని.. పెట్టుబడి సహాయం కింద చేసిన హామీలు.. ఇవన్నీకూడా మోసాలేనని నిర్ధారణ అయ్యిందని విమర్శించారు.
తమ పాలనలో, టన్ను అరటికి సగటున రూ. 25,000 ధర లభించిందని జగన్ తెలిపారు. రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించామని గుర్తుచేశారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్లు నిర్మించామన్నారు. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. కానీ నేడు, వ్యవసాయం కూలిపోతుంటే.. రైతులు నష్టాల్లో మునిగిపోతుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కిలో ఆహారం 50 పైసలైతే.. ఆ ఆహారాన్ని పండించే రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత అని ప్రశ్నించారు.
📢 HELLO INDIA, LOOK TOWARDS ANDHRA PRADESH!
One kilogram of bananas is being sold for just Rs 0.50!
Yes, you heard it right, fifty paise. This is the plight of banana farmers in AP.Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who… pic.twitter.com/Egqh7oXDRD
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 1, 2025
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

