YS Jagan | అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదారుల్లో గెలవాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. కూటమి దాడులను బలంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ రమేశ్‌పై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిని జగన్ ఖండించారు.
పులివెందులలో జరిగిన అల్లర్లలో గాయపడిన వైసీపీ నాయకులతో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడారు. వైసీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగితే తమకు ఓటమి తప్పదని కూటమి నేతలకు అర్థమైందన్నారు. అందుకే భయోత్పాతం సృష్టిస్తున్నారని తెలిపారు. కూటమి నాయకుల అనైతిక కార్యక్రమాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులంతా ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.