కడప: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ (YS Jagan) నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతితో కలిసి పుష్పాంజలి ఘటించారు. తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వారితో వైఎస్ విమలమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
అనంతరం అనంతరం తండ్రి సమాధి వద్ద జగన్మోహన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ, జగన్‌ను కౌగిలించుకొని భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తల్లిని ఆయన సముదాయించారు. అనంతరం జగన్ తన మూడు రోజుల పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయల్దేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
కాగా, తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం, పేదలకు వస్త్రాల పంపిణీ, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ, రహదారుల పక్కన మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు వెళ్లనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి, రాత్రికి తిరిగి హైదరాబాద్ రానున్నారు. ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ విజయవాడకు వెళ్లనున్నట్టు తెలిసింది.
#WATCH | Kadapa | Former Andhra Pradesh CM YS Jagan Mohan Reddy, along with YS Vijayamma, pays tribute to Late Dr YS Rajasekhara Reddy at Pulivendula YSR Ghat on his 75th birth anniversary. pic.twitter.com/ULNH20Gd1r
— ANI (@ANI) July 8, 2024