అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అచ్యుతాపురం(Achyutapuram ) సెజ్ ఘటనకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కారణమని మంత్రులు బీసీ సంక్షేమ, చేనేతశాఖ మంత్రి సవిత(Minister Savitha), రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) ఆరోపించారు. శుక్రవారం ఇద్దరు మంత్రులు వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక(Third Party Report) ను నాటి ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్లే అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఘటనకు కారణమని అన్నారు. శవ రాజకీయాలు చేస్తున్న జగన్ ఇకనైనా వాటిని మానుకోవాలని హితవుపలికారు. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.
కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అచ్యుతాపురం ఘటనను జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. ఘటనపై కూటమి ప్రభుత్వం ఘటనపై సరిగా స్పందించలేదంటూచేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారని గుర్తు చేశారు. తీవ్ర వేదనలో ఉన్న బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన చోట వైఎస్ జగన్ రాజకీయాలు మాట్లాడడం సిగ్గుచేటని ఆరోపించారు.