 
                                                            అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS. Jagan ) రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్(Governor Nazir) ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం వైసీపీ(YCP) నాయకులతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొనసాగుతున్న అరాచక పాలన, హత్యలు, దాడులు, విధ్వంసాలను జగన్ వివరించారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య, పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి (MP Mithun Reddy) పై రాళ్లతో దాడి , గత 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలను వివనించారు. విధ్వంసాల ఆధారాలు, వీడియోలను గవర్నర్‌కు అందించారు.
TDP MP | జగన్‌వి డైవర్షన్ పాలిటిక్స్ : టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
 
                            