AP Politics | వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి
AP Politics | ఏపీలో జోరుగా రాజకీయాలు మారుతున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షంలోకి చేరుతుండగా మరికొందరు అధికార పార్టీలోకి చేరుతున్నారు.
అమరావతి : ఏపీలో జోరుగా రాజకీయాలు మారుతున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షంలోకి చేరుతుండగా మరికొందరు అధికార పార్టీలోకి చేరుతున్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Dadi Veera Badra Rao) కుటుంబం నిన్న పేర్కొన్న విధంగా బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu) సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారులు రత్నాకర్, జైవీర్, అనకాపల్లికి చెందిన ముఖ్యనాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య (MLC Rama Chandraiah) సైతం టీడీపీ (TDP) లో చేరారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుండడం ప్రారంభించారు. దీంతో కొందరికి అవకాశాలు చేజారుతుండడంతో అలక చెందిన నాయకులు, మాజీలు ఇతర పార్టీల వైపు దిక్కులు చూస్తున్నారు.
దాడి వీరభద్రరావు కుమారులు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ని కనబరుస్తున్నారు. అయితే వైసీపీలో అవకాశం రాని పరిస్థితి ఉండడంతో మంగళవారం వైసీపీకి రాజీనామా చేశారు. దాడి వీరభద్రరావు, సి. రామచంద్రయ్య ఇద్దరు కూడా గతంలో టీడీపీలో క్రియశీలంగా పనిచేశారు. తిరిగి వీరిద్దరూ టీడీపీలో చేరడం రాజకీయంగా వారి నియోజకవర్గంలో పెనుమార్పులు జరుగనున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

