Davos Tour | ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఏడాది ఈ పిట్టలదొర చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లడం.. ప్రముఖులతో ఫొటోలు దిగడం తప్ప రాష్ట్రానికి ఒక్క కంపెనీని తీసుకురాలేదని విమర్శించింది. రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేకపోయినా ఆయన సొంత ఎలివేషన్లకు ఏ మాత్రం కొదవ లేకుండా భారీగా ఖర్చు పెడుతున్నారని ఎద్దేవా చేసింది.
చంద్రబాబు దావోస్ వెళ్లడం ఫొటోలు దిగడం తప్ప రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని వైసీపీ ఎద్దేవా చేసింది. కానీ ప్రతిసారి ఈయన బిల్డప్పులకు మాత్రం కొదవ లేదని..ఇప్పుడు కూడా దావోస్ పేరిట మళ్లీ బాబు జాతర మొదలైందని విమర్శించింది. దీనికి కోట్లకు కోట్లు పెట్టి భారీగా ప్రచారం చేయించుకుంటున్నారని.. కానీ ఫలితం మాత్రం శూన్యమని పేర్కొంది.
2014-19 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగుసార్లు, ఐటీ మంత్రిగా నారా లోకేశ్ ఒకసారి వెళ్లారని వైసీపీ తెలిపింది. మొత్తం దావోస్ పర్యటన కోసం రూ.55 కోట్ల వరకు ప్రజాధనం ఖర్చు చేయగా.. ఒక్క కోటి రూపాయల పెట్టుబడులు కూడా ఏపీకి రాలేదని విమర్శించింది. వారి పర్యటన సందర్భంగా ప్రకటించిన పెట్టుబడులపై పలు ప్రశ్నలు సంధించింది.
ఏటా ఈ పిట్టలదొర @ncbn
దావోస్ వెళ్ళడం. ఫోటోలు దిగడం తప్ప ఒక్క కంపెనీ కూడా రాలేదు. కానీ ఈయన బిల్డప్పులకు మాత్రం కొదవ లేదు. మళ్ళీ ఇప్పుడు దావోస్ పేరిట బాబు జాతర మొదలైంది. దీనికి కోట్లకు కోట్లు పెట్టి జాతీయ ఛానళ్లలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఫలితం మాత్రం శూన్యం..#CBNFailedCM… pic.twitter.com/9VQZdSSi3I— YSR Congress Party (@YSRCParty) January 20, 2025
– 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, సీఈవో సత్యనాదెళ్లతో చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతరం విశాఖకు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వచ్చాయని ప్రకటించారని గుర్తుచేసింది.
– 2016లో మియర్ బర్గర్, ఫిస్లోం సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు, రూ.2 వేల కోట్లతో ఘెర్జి టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు, ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే, వెల్సపన్ సంస్థలు పెట్టబడులకు ఆసక్తిగా ఉన్నాయని ప్రకటించారు.
– 2017లో ఐటీ, హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ రూ.43వేల కోట్ల పెట్టుబడులు, విశాఖలో యూకేకు చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల ఆస్పత్రి ఏర్పాటు, విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ ఆర్అండ్ డీ కేంద్రం ఏర్పాటపై ప్రకటనలు చేశారు
– 2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం, గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్ల ఏర్పాటు, ఏఐలో హిటాచీ పెట్టుబడులపై ప్రకటన
– 2019లో జేఎస్‌డబ్ల్యూ రూ.3500 కోట్ల పెట్టబడుల ఒప్పందం, డెలాయిట్, పెగా సిస్టమ్స్ యూనిట్ ఏర్పాట్లకు ఆసక్తిగా ఉన్నాయని ప్రకటించారు.
ఈ ప్రకటనలు అయితే వచ్చాయి కానీ.. రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు హయాంలో తీసుకురాలేకపోయారని వైసీపీ విమర్శించింది.
.@ncbn ఎప్పుడు అధికారంలో ఉన్నా దావోస్ పర్యటనలో… ప్రముఖులతో మీటింగులు అంటూ ఫోటోలతో భారీగా ప్రచారం చేసుకుంటారు. కానీ వారు చెప్పినట్లుగా ఒక్క ఐటీ పరిశ్రమ కూడా ఏపీలో ఏర్పాటు కాలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు దావోస్ వెళ్తున్నారు. రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేకపోయినా ఆయన సొంత… pic.twitter.com/w9HlVu5J5W
— YSR Congress Party (@YSRCParty) January 20, 2025