Payyavula Keshav | రాయలసీమలో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోయిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమలో వైసీపీకి ఉనికి కూడా లేదని విమర్శించారు. అరాచకం, విధ్వంసానికి జగన్.. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని తెలిపారు. అనంతపురంలో రేపు ‘సూపర్ సిక్స్-సూపర్‌హిట్’ విజయోత్సవ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి పట్టున్న రాయలసీమలో మరింత పట్టుబిగించేలా చంద్రబాబు సభ ఉండబోతుందని పేర్కొన్నారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణ రాయలసీమ నుంచే ప్రాతినిధ్యం వహించారని పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. టీడీపీకి పట్టు ఉన్న రాయలసీమలో మరింత పట్టుబిగించేలా చంద్రబాబు సభ జరుగుతోందని తెలిపారు. సభవకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
రాయలసీమలో వైసీపీ జీరో
రాయలసీమలో వైసీపీ జీరోకు పడిపోనుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు జోస్యం తెలిపారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల దెబ్బ నుంచి వైసీపీ ఇంకా కోలుకోలేదని అన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు అనంతపురం ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. జగన్ అరాచకాలపై ప్రజలకు ఇంకా కోపం పోలేదని చెప్పారు.