Kasibugga | కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యగా వ్యహరిస్తోందని అన్నారు. ఈ తొక్కిసలాటలో అమాయకులపై భక్తులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.
వైసీపీ నేతలపై హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేసిందని కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన, సింహాచలం, కాశీబుగ్గ ఘటనలో నిర్లక్ష్యం ఉందని అన్నారు. 20 వేల మంది భక్తులు వస్తారని అంచనా ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలియదా అని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ప్రతి ఏటా ఈ రోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు కదా అని అన్నారు. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమని మండిపడ్డారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలను కోరారని అన్నారు.