అమరావతి : జాతీయ ప్రాజెక్టు పోలవరం పూర్తికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వం ఎంపీలచేత రాజీనామా చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని బాబు ఆరోపణలను ఖండించారు.
పోలవరం ముంపు నిర్వాసితులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో జాప్యం జరిగితే 41.15 వరకు రాష్ట్రప్రభుత్వమే పరిహారం ఇచ్చేందుకు ఏపీ సీఎం సంసిద్ధతను వ్యక్తం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంపై పోలవరం గురించి ఎందుకు రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని సూచించారు.
ఏదేని సమస్యపై చంద్రబాబు 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఏనాడైనా ఎమ్మెల్యేలతోగాని సర్పంచులతో రాజీనామా చేయించినా చరిత్ర ఉందా అని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ నేతల ఉచిత సలహాలు తమకు అవసరం లేదని తెలిపారు.