YV Subba Reddy | ఈవీఎంలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడానికి అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు కూడా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలపై చంద్రబాబు మాట్లాడారని తెలిపారు. అప్పుడు చంద్రబాబు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారని అన్నారు. ఇప్పుడు తమకు కూడా ఈవీఎంలపై సందేహాలు ఉన్నాయని.. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. అనుమానాలు నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ నేతల వ్యాఖ్యలపైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ దిగజారి మాట్లాడుతుందని అసహనం వ్యక్తం చేశారు. అసలు వెలిగొండ ప్రాజెక్టుకు ఎవరు ఎన్ని నిధులు కేటాయించిన విషయం, పనులు ఎవరు పూర్తి చేశారనే విషయం ప్రకాశం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు.