అమరావతి : ఏపీలో వైసీపీ నాయకుల(YCP Leaders) పై అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ (TDP) నాయకులు శునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు పేర్నినాని(Perninani) ఆరోపించారు. కూటమి చేస్తున్న మోసాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రజా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. నూజివీడు జైలులో ఉన్న వైసీపీ కార్యకర్తలను శనివారం పరామర్శించారు.
ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలను, నాయకులను లక్ష్యంగా చేసుకుని పాత కేసులను తిరగదోడి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల బాగోగులను పట్టించుకోకుండా వైసీపీ కార్యకర్తలను జైళ్లో పెడుతున్నారని ఆరోపించారు.
అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి అంటూ కాకమ్మ కబుర్లు చెబుతూ తెరచాటున మట్టి, ఇసుక దోపిడి, లేఅవుట్ల పేరుతో దోపిడి చేస్తున్నారని విమర్శించారు. వల్లభనేని వంశీపై అన్యాయంగా కేసు పెట్టారని ఆరోపించారు. అతడిని అరెస్టు చేయకముందే అరెస్ట్ అంటూ తప్పడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.