Kakani Govardhan | మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 86 రోజలు పాటు నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. ఇవాళ ఉదయం జైలు నుంచి బయటకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి కాకాణి పూజిత, ఎమ్మెల్సీలు మురళి, చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని తెలిపారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారని.. ఏడు పీటీ వారెంట్లు జారీ చేశారని చెప్పారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. మా లక్ష్య సాధనలో జైళ్లు అడ్డంకి కాదన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలే తన ఆస్తి అని.. మాజీ మంత్రి (నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి) ఇంటిపై దాడి దుర్మార్గమని అన్నారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయిందని.. ఆ దోపిడీని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై పోరాటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.