హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): టీడీపీ నేతల దాడులతో ఏపీలో అత్యంత భయానక వాతావరణం నెలకొన్నదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని గురువారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఎకడికకడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, విజ్ఞప్తి చేశారు. కాగా, ఏపీ ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎస్ జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లినట్టు సమాచారం.