కర్నూలు: నవ మాసాలు మోసి కన్న బిడ్డలను కాదని తాను కూడా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే గ్రామానికి చెందిన మహిళ తన ఇద్దరు పిల్లలకు పురుగుమందు తాగించి తాను తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ముగ్గుర్ని ఆదోని ప్రాంతీయ దవాఖానకు తరలించగా పరిస్థితి విషమించడంతో వారికి మెరుగైన వైద్య సహాయం కోసం కర్నూలు దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదని, ప్రాథమికంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వారు వివరించారు.