అమరావతి : కర్నూలు జిల్లాలో ( Kurnool district ) జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రకాష్‌నగర్ కాలనీకి చెందిన బంగారం వ్యాపారి కామిశెట్టి గురువయ్య తన కూతురు వివాహం ఈనెల 20న ఘనంగా జరిపించారు. తిరుపతి(Tirupati) లో ఉండే అల్లుడి ఇంటిలో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు బుధవారం రాత్రి కారులో బయలు దేరారు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్ కారును ఢీ కొనగా కారులో ఉన్న గురువయ్య బంధువులు సుచిత్ర, వాసవి, ప్రేమ్‌కుమార్ మరణించగా మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.