Chandrababu | ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష జరిపారు. త్వరలో ప్రజలకు అందించబోయే రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలపై సమీక్షించారు. సమావేశంపై చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. పట్టాదార్ పాస్ బుక్‌లపై తన బొమ్మ వేసుకొని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మ ఉండకూడన్నది ప్రజల అభిప్రాయమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని సీఎం ప్రకటించారు.
అహంకార పూరిత, పెత్తందారీ పోకడలు ప్రజాప్రభుత్వంలో ఉండవన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు చేసిన సమీక్ష వివరాలను.. మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాకు వివరించారు. పాస్ పుస్తకాల్లో వైఎస్ జగన్ ఫొటోను ఎందుకు వేశారో అర్థం కాలేదని.. ఇకపై రాజముద్రతో పాస్ పుస్తకాలను రాజముద్రతో ఇవ్వనున్నట్లు తెలిపారు. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద అధ్యయనం చేసి.. ప్రజలకు మేలు చేసేలా ఏపీలో ఆ చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు.
పట్టాదారు పాసుపుస్తకాలపై తన బొమ్మ వేసుకుని తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నాం. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులపై ఎవరి బొమ్మా ఉండకూడదు అనేది ప్రజా అభిప్రాయం. అందుకే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజముద్రతో కొత్త… pic.twitter.com/KwPum6lB2z
— N Chandrababu Naidu (@ncbn) July 29, 2024