Kanyaka Parameswari : సాధారణంగా అమ్మవారి ఆలయం అంటేనే వెండి, బంగారు దగదగలు కనిపిస్తుంటాయి. అమ్మవారిపై నగలు తళతళ మెరుస్తుంటాయి. ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో దేశంలోని అమ్మవారి ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగరంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారు అద్భుతమైన అలంకరణతో అలరారుతున్నారు.
కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు కిలో బంగారం, 10 కిలోల వెండి, రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్ల కట్టలతో అలంకరించారు. అమ్మవారి వెనుకవైపున పరదాలా కరెన్సీ నోట్లను వేలాడదీశారు. అదేవిధంగా అమ్మవారి చుట్టూ పెట్టిన వెండి, బంగారు సామాగ్రి కింద కూడా కరెన్సీ నోట్ల కట్టలు పెట్టారు. చూడముచ్చటగా అలంకరించుకుని ఉన్న కన్యకాపరమేశ్వరి అమ్మవారిని కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Visakhapatnam, Andhra Pradesh: Diety at the famous Sri Kanyaka Parameswari temple in Visakhapatnam, was decorated with 6 kg of gold, Rs 4 crore in cash, and 10 kg of silver.
(Source: Sri Kanyaka Parameswari temple) pic.twitter.com/SggU3cIx6X
— ANI (@ANI) October 11, 2024