అమరావతి : ఏపీలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా మరికొన్ని చోట్ల ఉద్రిక్తల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ (Polling) కు ఎన్నికల సంఘం అధికారులు, పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. అయితే పోలింగ్ ఏజెంట్లపై దాడులు, బెదిరింపులతో ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అన్నమయ్య(Annamaiah) జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంటు రాజారెడ్డిని పోలింగ్ కేంద్రం నుంచి కొందరు కిడ్నాపు చేయడంతో స్థానిక జనసేన నాయకులు కోపోద్రిక్తులయ్యారు. పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంల (EVMs) ను ధ్వంసం చేయడంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది . పల్నాడు జిల్లా మాచర్లలో ఈవీఎం ధ్వంసంతో సిబ్బంది పోలింగ్ నిలిపివేసి బయటకు వెళ్లిపోయారు.