అమరావతి : ఏపీలోని విశాఖ జిల్లాకు చెందిన యువకుడు కెనడాలో మృతిచెందిన ఘటన ఆ యువకుడి కుటుంబంలో విషాదం నింపింది. ఉన్నత చదువులకోసం గత నెల రోజుల క్రితం టొరంటో స్కూలిచ్ వర్సిటీలో ఎంబీఏలో చేరిన విశాఖ జిల్లా యువకుడు మధుకుమార్(30) నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. అక్కడి స్థానికులు గమనించి సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మధుకుమార్ మృతి చెందిన విషయాన్ని ఇవాళ అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.