అమరావతి : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రెండోరోజు విశాఖలో బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. స్టీల్‌ప్లాంట్ ప్రధాన గేట్ వద్ద కార్మికులు భారీ సంఖ్యలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రమంత్రులు కొందరు విశాఖ ప్లాంట్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించు కోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా దేశంలోని వందమంది ఎంపీల సంతకాలను సేకరించి ప్రభుతానికి అందజేస్తామని విశాఖ స్టీల్ సాధన సమితి నాయకులు వెల్లడించారు. ప్రైవేటీకరణ ఉపసంహరించు కోవాలని పార్లమెంట్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా ప్రయత్నిస్తామని తెలిపారు.