తిరుమల : ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందు వల్లే అధికార వైసీపీకి తిరుమల వేంకటేశ్వరస్వామి శిక్ష వేశారని సినీనటుడు శివాజీ (Actor Sivaji ) పేర్కొన్నారు. శుక్రవారం తిరుమల (Tirumala) లో శ్రీవారి దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పు వల్ల వెంకటేశ్వరస్వామి (Venkateshwara Swamy) కళకళలాడుతున్నాడని, అంతకు ముందు తేడాగా కనిపించాడని అన్నారు. అమరావతి, పోలవరం మాటను తీర్చకపోవడం వల్లే స్వామివారు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు.
చంద్రబాబు (Chandra Babu) ఆధ్వర్యంలో పవన్‌కల్యాణ్(Pawan Kalyan), బీజేపీ కూటమి పాలనలో ఏపీకి సువర్ణ అధ్యాయం మొదలైందని , అద్భుతమైన ప్రగతిని సాధించబోతుందని అన్నారు. వైసీపీ పాలనలో టీడీపీ శ్రేణులను తిట్టినా, కొట్టిన పరిస్థితి ప్రస్తుతం సీన్ రీవర్స్ అవుతుందని అన్నారు. ప్రజలకు పనికిరాని ముచ్చట్లు చెప్పొద్దని, స్వామి వద్ద ఎవరైనా డ్రామాలు చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు.