హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో రామరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రూ.1,500 ఆర్జితసేవా టికెట్ ఉన్న భక్తులతో వ్రతం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు తెల్లరేషన్ కార్డు కలిగి ముందస్తు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచితంగా వ్రతాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.