అమరావతి : వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని (Vallabhaneni Vamsi) వంశీకి ఏపీ హైకోర్టు ( High Court ) లో ఊరట లభించింది. ఈనెల 20వ తేదీ వరకు అతడిపై అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై (TDP Office) దాడి కేసులో వంశీ 71 నిందితుడిగా కొనసాగుతున్నారు. అంతకు ముందు ఉన్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపగా వంశీ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. దీనిపై కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశిస్తూ కేసును వాయిదా వేసింది.