Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఊయల సేవ కన్నుల పండువగా జరిగింది. లోక కల్యాణం కోసం ప్రతి శుక్రవారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజుల్లో ఈ ఊయల సేవ నిర్వహిస్తుంటారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా మహాగణపతిపూజ సంకల్పాన్ని పఠిస్తారు. అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపిస్తారు. చివరగా ఊయలసేవ నిర్వహిస్తారు. ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు చేస్తారు.