YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతివ్వాలని కోరారు.
వచ్చే నెల 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎస్వీ రాధాకృష్ణణ్ను అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా నేడో రేపో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డీయే భావిస్తోంది. ఈ క్రమంలోనే పోటీ లేకుండా చూసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పలువురు విపక్ష నేతలకు రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ల నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్‌కు రాజ్‌నాథ్ సింగ్ కాల్ చేసి మద్దతు కోరారు. ఈ అంశంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం చెబుతానని జగన్ బదులిచ్చినట్లు సమాచారం.