Deputy Speaker | ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవికి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో ఇవాళే ఆయన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది.
డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ రాజు ఎంపిక లాంఛనప్రాయంగానే జరగనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యే ఉండటం.. పైగా వారు శాసన సభకు దూరంగా ఉండటంతో ఏకగ్రీవంగానే రఘురామ ఎన్నిక కానున్నారు.
బీజేపీలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రఘురామ కృష్ణరాజు 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కానీ కొంతకాలానికే జగన్‌పై ఆయన విమర్శలు చేస్తూ రెబల్‌గా మారారు. ఈ క్రమంలో గత ఎన్నికల ముందు రఘురామ టీడీపీలో చేరారు. ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ గెలిచారు.