అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొనలేకే చంద్రబాబు, నాయకులు తనపై తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. దుష్ప్రచారాలు మానుకోకపోతే చంద్రబాబుపై పదింతలు దుష్ప్రచారం చేసేందుకు తన వద్ద ఆదారాలతో సహ ఉన్నాయని వెల్లడించారు. అడాన్ కంపెనీతో తనకు సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఖండించారు. పరిధిలు దాటితే సహించబోమని చంద్రబాబు, లోకేశ్‌ను హెచ్చరించారు.
తాను ఏనాడు కూడా మహిళ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయలేదని అన్నారు. వైసీపీ బురద చల్లాలనే ఆలోచనను మానుకోవాలని సూచించారు. ఎదుటివారి బురద చల్లి ఆనందించే వారిలో చంద్రబాబు ముందంజలో ఉంటారని తెలిపారు. కార్పొరేట్ కంపెనీలో వేలాది కోట్ల రూపాయలను ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు మనుషులదేనని విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా బూతులు తిడితే తాము కూడా అదే పని చేయవచ్చని కాని తాము అలా చేయబోమని, వైసీపీ విలువలు గల పార్టీ అని పేర్కొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తనకు వరుసకు‘ అన్న’ అవుతారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తన భార్య సోదరి కూతురిని తారకరత్నతో వివాహం జరిగిందని ఈ పరంగా చూస్తే తనకు చంద్రబాబు బంధువు అవుతారని వ్యాఖ్యనించారు.