Car accident | ఏపీలో దారుణం చోటు చేసుకుంది. రాజమండ్రిలో మెడికల్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించడంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రియాంక (28) ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లింది. ప్రసాదిత్యా మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురై అతివేగంగా కారు నడుపుతూ స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను నిందితులు వెనుక నుంచి ఢీకొట్టారు. ఆమె రోడ్డుపై పడిపోగా ఆ కారు ఆమె తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేర్పించారు. బాధితురాలు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇద్దరు నిందితులను ప్రకాష్ నగర్ పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రాజమండ్రిలో మెడికల్ విద్యార్థినిపై కారు ఎక్కించిన ఇద్దరు యువకులు
ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లిన జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రియాంక (28)
ప్రసాదిత్యా మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం… pic.twitter.com/PNZ1Fws4vg
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026