అమరావతి : కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లిన ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. జిల్లాలోని ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద ముగ్గురు స్నానానికి నదిలో దిగారు. వారికి ఈత రాక మునిగిపోయారు. స్థానికులు గమనించి ఒకరిని కాపాడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు.
మృతులు రాజమహేంద్రవరానికి చెందిన రాజ్యలక్ష్మి(22). శ్రీదేవి ( 23)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం స్థానిక గజ ఈతగాళ్ల సహాయంతో పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు.