అమరావతి : ఏపీలో దారుణం చోటు చేసుకుంది. 24 గంటల్లో చిత్తూరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నాయకులు (TDP leader) దారుణ హత్యకు గురయ్యారు. చిత్తూరు( Chittoor) జిల్లా పుంగనూరు మండలంలో టీడీపీ lenjici దారుణ హత్యకు గురయ్యారు. అతడి కుమారుడు సురేష్‌పై వైసీపీకి చెందిన వెంకటరమణ కొడవలితో దాడి చేసి గాయపరిచాడు.
గాయపడ్డిన తండ్రి, కుమారుడిని మదనపల్లెలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మర్గమద్యలో తండ్రి రామకృష్ణ ( Ramakrishna ) మృతి చెందాడు. తీవ్ర గాయాలతో సురేష్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడని పోలీసులు వివరించారు. వెంకటరమణ వర్గీయులపై పుంగనూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయిందని వెల్లడించారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపు సంబరాలు చేశారని గతంలోనూ రామకృష్ణ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. రామకృష్ణ భార్య ఉమాదేవిని వెంకటరమణ వర్గీయులు కారుతో ఢీ కొట్టించగా వారిపై కేసులు నమోదయ్యాయి.
కాగా నిన్న రాత్రి కర్నూలు ( Kurnool ) జిల్లాలోని టీడీపీ నాయకుడు సంజన్న దారుణ హత్యకు గురయ్యాడు. షరీఫ్ నగర్లో నివాసముంటున్న సంజన్న రాత్రి నమాజ్ చేసుకోవడానికి స్థానిక ప్రార్థనా మందిరానికి వెళ్లగా అతడిపై వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసి చంపివేశారు. రాజకీయ కక్షల కారణంగానే హత్య జరిగిందని స్థానికులు ఆరోపించారు. మృతదేహాన్ని కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు.