అమరావతి : ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట కొత్తబోయినపల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident ) ఇద్దరు విద్యార్థులు (Students) మృతి చెందారు. స్కూటర్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు ఆర్టీసీ బస్సును (RTC Bus) ఢీ కొన్నారు. ప్రమాదంలో కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కిరణ్, పులివెందులకు చెందిన బన్నీ మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.