అమరావతి : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దన్నానపేటలో ఒకే భవనంలో ఇద్దరు మృతి చెందిన ఘటన కలకలం సృష్టిస్తుంది. ఒక వ్యక్తి ఉరేసుకున్న స్థితిలో ఉండగా మరో మహిళ మృతదేహం లభించింది. ఆమె మెడపై రక్తపు మరకలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరిది హత్య లేదా ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.