అమరావతి: అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని మరో లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు కర్ణాటకకు చెందిన ఉలిగప్ప, మహబూబ్గా గుర్తించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను సమీప ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురి రూంకు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందజేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.