 
                                                            అమరావతి : ఏపీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident ) ఇద్దరు మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడులో చీరాల వైపు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఉప్పుటూరుకు చెందిన సింగమ్మ(65), రాఘవయ్య(74) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
 
                            