గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి..

తూర్పుగోదావరి : గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు ఐటీఐ విద్యార్థులు మృతి చెందారు. ఆత్రేయపురం ఎస్ఐ సుధాకర్ తెలిపిన వివరాలు.. రాజమహేంద్రవరానికి చెందిన కొల్లాబత్తుల దయాకర్, డి. సత్యనారాయణలు ధవళేశ్వరంలోని వివేకానంద కళాశాలలో ఐటీఐ చదువుతున్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరి నదిలో స్నానాలు చేస్తూ నీటి ప్రవాహానికి ఈత రాక మునిగి గల్లంతయ్యారు.
సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలు సంఘటన స్థలానికి కొంత దూరంలో లభ్యమయ్యాయి, సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

