హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో మార్చిలో జరుగనున్న కార్యక్రమాల వివరాలను టీటీడీ అధికారులు విడుదల చేశారు. మార్చి 7న తిరుకచ్చినంబి శాత్తుమొర, 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల ప్రారంభం, 10న మతత్రయ ఏకాదశి, 13న తెప్పోత్సవాల సమాప్తి, 14న కుమారధారతీర్థ ముకోటి, 25న సర్వఏకాదశి, 26న అన్నమాచార్య వర్ధంతి, 28న మాసశివరాత్రి, 29న సర్వ అమావాస్య, 30న శ్రీవిశ్వా వసునామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్టు వివరించారు.
తిరుమలలో రద్దీ కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతున్నట్టు తెలిపారు.