TTD | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారిక వెబ్సైట్ పేరును మారోసారి మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు పేరు thirupathibalaji.ap.gov.in ఉండగా.. దాన్ని ttdevasthanams.ap.gov.in మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని దేవస్థానం కోరింది. వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్సైట్, వన్ మొబైల్ యాప్లో భాగంగా వెబ్సైట్ను మార్చినట్లు వివరించింది. వెబ్సైట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల వెబ్సైట్ ద్వారానే విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపై నుంచి భక్తులు కొత్త వెబ్సైట్లోనే టోకెన్లను బుక్ చేసుకోవాలని కోరింది.